అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దహనం కేసులో విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసును ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడంతో పైల్స్ దాహనం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అన్ని వేళ్ళు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైపే చూపిస్తుండటంతో ఆయన అనుచరులు, వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇప్పటికే ఫైల్స్ దహనం కేసులో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు , వైసీపీ నేత మాధవ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో కేసులో పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిత్తూర్ జిల్లా సోమల మండలం ఆవులపల్లె దగ్గర 165ఎకరాల భూముల్ని శశిధర్ కబ్జా చేసినట్లుగా మోహన్ నాయుడు ఇటీవలే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు హైదరాబాద్ కు వెళ్ళిన పోలీసులకు ఆయన మొదట అందుబాటులోకి రాలేదు. ప్లాట్ యజమాని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ , శశిధర్ ఉండే ఇంటి తాళంచెవులను ఇవ్వడంతో శశికాంత్ ఇంటిలో సోదాలు చేపట్టారు పోలీసులు. కీలక పత్రాలతో పాటు 2 ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు శశికాంత్ ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు పెద్దిరెడ్డి మంత్రిగా పని చేసినప్పుడు అధికారిక పీఏగా పని చేసిన తుకారాం కూడా అరెస్ట్ భయంతో విదేశాలకు పారిపోయినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో అరెస్ట్ చేస్తారని భయంతోనే పారిపోయారని అంటున్నారు. పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్ళలోనూ సోదాలు నిర్వహించారు పోలీసులు.
వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అండతో ఆయన కోటరీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఒక్కొక్కటిగా భూకబ్జాల బాగోతం బయటకు వస్తుండటంతో పాటు మదనపల్లె పైల్స్ దహనం ఫైర్ యాక్సిడెంట్ కాదని తేలడంతో.. విచారణలో పోలీసులు మరింత దూకుడు పెంచనున్నారు. ఈ కేసుల్లో ఎటు చూసినా పెద్దిరెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చునని తెలుస్తోంది.