శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ కైవసం చేసుకుంది. గౌతమ్ గంభీర్ కోచ్గా, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు కెప్టెన్గా నియమితులయ్యాక ఇండియా గెలుచుకున్న తొలి సిరీస్ ఇది. రెండో టీ20లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ మొదలవగానే వర్షం పడి.. గంటకు పైగా ఆట ఆగింది. దీంతో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా కుదించారు. యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య అదరగొట్టడంతో భారత్ 6.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ సిరిస్ విజయంలో యువ ఆటగాళ్ళు జోరు చూపించారు. గంబీర్ శిభిరంలో వున్న మార్క్ కనిపించింది. గంబీర్ అంటేనే దూకుడు. ఈ సిరిస్ లో ప్రతి ప్లేయర్ దూకుడు స్వభావంతోనే ఆడారు. తొలి మ్యాచ్ కాస్త టఫ్ గానే జరిగింది. శ్రీలంక లక్ష్యాన్ని చేధించినట్లే కనిపించింది. అయితే ఇక్కడో అనూహ్యపరిణామం జరిగింది, రియాన్ పరాగ్ కి బౌలింగ్ వేసే అవకాశం రావడం ఎవరూ వూహించలేదు, అతడు అనూహ్యంగా మూడు వికెట్లు పడగొట్టాడు. గంబీర్ మొదటి నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. టీంలో ప్రతి ప్లేయర్ ఎదోరకంగా కాంట్రిబ్యుట్ చేయాలని. ఇప్పుడు అదే దిశగా జట్టు పయనిస్తుందని భావించాలి.