అసెంబ్లీలో విద్యుత్ శాఖపై వాడివేడి చర్చ జరుగుతోంది.ఈ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంకా చర్లపల్లి జైల్లోనే ఉన్నట్టు మాట్లాడుతున్నారని సెటైర్లు వేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది.
ఈ సందర్భంగా మైక్ అందుకున్న జగదీశ్వర్ రెడ్డి..తాను ఉద్యమ సమయంలో చర్లపల్లి జైలుకు వెళ్ళినందుకు గర్వపడుతున్నానన్నారు. రేవంత్ ఎందుకు వెళ్లారని.. ఆయన ఇంకా ఆ జైలు అనుభవాలను మరిచిపోలేకపోతున్నారని అందుకే చర్లపల్లి జైలు గురించి మాట్లాడుతున్నారని ఎదురుదాడికి దిగారు. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read :కేసీఆర్ సర్కారులో మరో కుంభకోణం… ఈసారి సీఎస్ పైనే ఆరోపణలు!
సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే.. మిల్లర్లు అంతా కలిసి ఎవరిని చెట్టుకు కట్టేశారో సూర్యాపేటలో ఎవరిని అడిగినా చెబుతారంటూ కౌంటర్ ఇచ్చారు. జగదీశ్వర్ రెడ్డి గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రెండు నిమిషాల సమయం ఇస్తే జగదీశ్వర్ రెడ్డి చరిత్రను వివరిస్తారని చెప్పడంతో ఆ తర్వాత వెంకట్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
జగదీశ్వర్ రెడ్డి సొంత గ్రామానికి చెందిన నేత హత్య కేసులో ఏ -2గా ఉన్నారని, భిక్షం అనే వ్యక్తి హత్య కేసులోనూ ఏ -6 గా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. పెట్రోల్ బంక్ లో దోపిడీ కేసులోనూ నిందితుడిగా ఉన్నారని ఆరోపించారు.