బీహార్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీతో రంగంలోకి దిగుతున్నారు ఇప్పటి వరకూ ఆయన అధికారికంగా పార్టీ పెట్టలేదు. గతంలో జనసురాజ్ పేరుతో పాదయాత్ర చేశారు. మధ్యలో ఆపేశారు. ఇప్పుడు ఆదే పేరుతో పార్టీ ప్రారంభిస్తున్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున లాంఛనంగా ప్రారంభిస్తారు.. వచ్చే ఏడాది బిహార్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తామని వెల్లడించారు.
దేశంలో చాలా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్‌కు బీహార్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనను గతంలో జేడీయూ నేత , సీఎం నితీష్ కుమార్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. జేడీయూ పార్టీలో కీలక హోదా ఇచ్చారు. అయితే తర్వాత పీకేను మెల్లగా వెనక్కి నెట్టేశారు. రాజకీయ వ్యూహాలు వేరు.. రాజకీయాలు వేరని అర్థమయ్యేసరికి.. ప్రశాంత్ కిషోర్ ట్రాక ్మార్చారు. తర్వాత కొంత మందికి స్ట్రాటజిస్టుగా పని చేసి.. మళ్లీ బీహార్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.
Also Read : ఏపీ, బీహార్‌కు బడ్జెట్లో ప్రత్యేక సాయం ?
రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రశాంత్ కిషోర్‌కు చాలా కోరిక ఉంది. అయితే స్ట్రాటజిస్ట్.. రాజకీయ నేత అవుతాడా లేదా అన్నది చెప్పడం కష్టమే. కానీ ఆయనకు కావాల్సినంత గుర్తింపు ఉంది. బీహార్‌లో సామాజిక నేపధ్యమూ కలసి వస్తుందని భావిస్తున్నారు. పీకే పార్టీ ప్రధానంగా జేడీఎస్‌ను దెబ్బకొట్టే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే బీజేపీ కూడా పీకేకు సహకరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పీకే జనసురాజ్ పార్టీతో … బీహార్ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగడం ఖాయంగా కనిపిస్తోంది.