తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని మరోసారి సర్ ప్రైజ్ చేయబోతున్నారు. లక్షన్నర వరకూ అప్పులు ఉన్న రైతుల్ని మంగళవారం రుణవిముక్తుల్ని చేయబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సభా ప్రాంగణం నంచే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ విడతలో 7 లక్షల మందికి రైతులకు రుణమాఫీ జరగనుంది. ఇందు కోసం 7 వేల కోట్లు జమ చేయనుంది. ఇప్పటికే 1 లక్ష రుణమాఫీ చేసిన ప్రభుత్వం11 లక్షల రైతులకు 6000 కోట్ల రూపాయలను మాఫీ చేసిన ప్రభుత్వం…. రెండో విడతగా లక్షన్నర వరకూ మాఫఈ చేస్తోంది. ఆగస్టు 15 తారీకు లోగా రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమయింది.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. రూ. రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనులోపు చేస్తామని రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రకటించారు. అన్న మాట ప్రకారం… నిధులను సమీకరించి నెల ముందుగానే ప్రక్రియ ప్రారంభించారు. దాదాపుగా 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి పెద్ద ఊరట నివ్వనుంది. గతంలో కేసీఆర్ క్ష రుణమాఫీ అని చెప్పారు కానీ ఐదేళ్లలో పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తోంది.
Also Read : రుణమాఫీ వేళ సైబర్ నేరగాళ్ల పన్నాగం!
కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్న కారణంగా కొంత మంది అనర్హకు గురయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పేర్లపై రుణాలు తీసుకుని ఉంటే వారిలో ఒకరికే రుణమాఫీ అవుతుంది. ఇలాంటి సమస్యలను అడ్టం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు రుణమాఫీ మోసమంటున్నారు. కానీ రుణమాఫీ అయిన రైతుల్లో మాత్రం ఆనందం కనిపిస్తోంది.