ఒలింపిక్స్‌లో పతకం కోసం పోరాడుతున్న బృందంలో తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజి కూడా ఒకరు. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఏ భారత క్రీడారులు సాధించని ఘనతను 24 ఏళ్ల తెలుగు బిడ్డ సాధించింది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో పారిస్ బెర్త్ దక్కించుకుంది.
విశాఖపట్నంలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి యర్రాజీ విశ్వక్రీడలకు వరకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. ఆమె శ్రమకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన గాండీవ ప్రాజెక్టు చేయూనిచ్చింది. గాండీవ ప్రాజెక్టు ద్వారా టెన్ విక్ అనే సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందించింది. ఈ టెన్ విక్ సంస్థ మాజీ క్రికెట్ అనిల్ కుంబ్లేది. అనిల్ కుంబ్లే క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత క్రీడా సేవల సంస్థ టెన్విక్ను ప్రారంభించారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు హయాంలో టెన్విక్ సంస్థ ఏపీ సర్కార్‌కు పలు సేవలు అందించింది.
Also Read : చంద్రబాబుతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న రేవంత్
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంత క్రీడాకారులను గుర్తించడం కోసం ప్రాజెక్ట్ గాండీవను ప్రారంభించారు. ఇలాంటి సేవలను టెన్ విక్ సంస్థ అందించింది. ఏపీలో చేపట్టిన కార్యక్రమాల గురించి.. టెన్విక్ సంస్థ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అదంతా చంద్రబాబు సీఎంగాఉన్నప్పుడే. జగన్ సీఎం అయిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ మూలనపడ్డాయి. అయితే అప్పటి ప్రాజెక్టు ఫలితంగానే జ్యోతి యర్రాజీని ప్రతిభను గుర్తించి సానబెట్టామని లింక్డ్ ఇన్‌లో కుంబ్లే గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు కూడా జ్యోతి యర్రాజీకి బెస్టాఫ్ లక్ చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ వెలికి తీసే ప్రాజెక్టులన్నీ గత ఐదేళ్లుగా ఆగిపోయాయి. గాండీన ప్రాజెక్టును కొనసాగించి ఉంటే… ఎంతో మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఏపీ నుంచి వెలుగులోకి వచ్చేవారు.