హైదరాబాద్ చుట్టుపక్కల హౌసింగ్ ప్రాజెక్టుల్ని పెంచేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ.. కొత్త ప్రయత్నాలు చేస్తోంది. కొత్త లే-అవుట్లను డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది. రైతుల నుంచి పూలింగ్ పద్దతిలో భూములను సేకరించి డెవలప్ చేసి.. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించి ఆదాయం పెంచుకోవాలనుకుంటోంది. నిజానికి ఏపీ రాజధాని అమరవతికి పూలింగ్ పద్దతి సక్సెస్ అయిన తర్వాత హెచ్ఎండీఏ కూడా అదే చేయాలనుకుంది. కానీ ల్యాండ్ డెవలప్మెంట్లో తమ వాటా పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు గత సర్కార్ ఓకే చెప్పడంతో రైతుల వాటా 60శాతానికి పెరిగింది.
హెచ్ఎండీఏకు ఇవ్వడం వల్ల.. రైతులకు అనేక మేళ్లు జరుగుతాయి. భూములు ఇచ్చే వారికి ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లే-అవుట్లుగా మార్చాలంటే నాలా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కాని హెచ్ఎండీఏకు భూములు అప్పజెప్పితే వాటికి నాలా చార్జీలతో పాటు పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్ఎండీఏ భరిస్తుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్ఎండీఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది.
Read Also : ఔటర్, రీజనల్ రింగ్‌రోడ్ల మధ్యలో పారిశ్రామిక క్లస్టర్లు
ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ల వద్ద ఎక్కువ లే-అవుట్లు ఉండేలా హెచ్ఎండీఏ ప్రణాళికలు రెడీ చేసుకుంది. హెచ్ఎండీఏ అమ్ముతుంది కాబట్టి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తుంది. అందుకే కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అలాగే మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులో ఉంటే ఇళ్ల స్థలాలను కూడా హెచ్ఎండీఏ రెడీ చేయనుంది. ఇప్పటికే సిటీ చుట్టూ ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని డెవలప్మెంట్ కోసం అధికారులు గుర్తించారు.
మొత్తంగా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11వేల ఎకరాల భూమిని హెచ్ఎండీఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. హెచ్ఎండీఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు… ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళ్తే అంతే వేగంగా హైదరాబాద్ నగరం ఔటర్ చుట్టూ విస్తరిస్తుంది.