వైసీపీ హయాంలో గనుల శాఖలో విచ్చలవిడిగా జరిగిన దోపిడీలు, దౌర్జన్యాల్లో మూల విరాట్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటే ఆయన తరపున పనులు చక్కబెట్టిన వ్యక్తి వీరభద్రరావు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా గనుల శాఖలోకి వచ్చి … మంత్రి తరపున మంత్రి అన్నట్లుగా చెలరేగిపోయారు. ఆయన గురించి సెక్రటేరియట్ లోనే కాదు.. గనుల శాఖ మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను గుమ్మానికి వేలాడదీస్తారని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రం ఆయనకు సకల మర్యాదలతో రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అదే ఆశ్చర్యకరంగా మారింది.
బెదిరింపులు, కమిషన్లు మొత్తం వీరభద్రరావు చేతుల మీదుగానే!
రాష్ట్రం మొత్తం మీద .. వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి దోపిడికి గురి కాని వారు ఉండరు. ప్రతి గనుల శాఖ యజమాని కప్పం కట్టారు. కట్టని వాళ్లపై వందల కోట్ల జరిమానాలు వేశారు. ఈ ప్రక్రియ మొత్తం నడిచింది వీరభద్రరావు చేతుల మీదుగానే . తనిఖీలు చేయడం… బెదిరించడం.. డబ్బులు వసూలు చేయడం.. ఇంకా కావాలంటే బలవంతంగా గనుల్ని లాగేసుకోవడం అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఇసుక, క్వార్జ్, సిలికా శాండ్ దేన్నీ వదిలి పెట్టలేదు. అన్ని గనుల్లోనూ ఆయన దందానే కీలకంగా కనిపించేది. లీజులు కూడా ఆయన కనుసన్నల్లోనే ఇచ్చేవారు.
సహకరించని అధికారులకు వేధింపులు
ఓఎస్డీగా వచ్చి గనుల శాఖలో వీరభద్రరావు చేసిన పెత్తనం అంతా ఇంతా కాదు.గనుల శాఖ అధికారులందర్నీ వేధించారు. ఐదేళ్లులో ఆయన ఇరవై ఆరు మంది అధికారుల్ని సస్పెండ్ చేయించారు. మరికొందరు అధికారుల్ని వర్క్ అడ్జస్ట్ మెంట్ పేరుతో బదిలీ చేసి వేధించారు. వీరంతా తమ అక్రమాలకు అడ్డు వస్తారనే అలా చేశారు. ప్రత్యేకంగా జిల్లాల్లో అధికారవర్గాల్లో తన కోటరీని ఏర్పాటు చేసుకుని చేయాల్సినంత రచ్చ చేశారు.
వీరభద్రరావు దందాలకు మెచ్చిన పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి చేసేఅక్రమాలకు… వీరభద్రరావు పూర్తి సహకారం ఇచ్చేవారు. మిగతా దోపిడీ పనులు చక్కబెట్టేవారు. ఆ విషయం లో పెద్దిరెడ్డి అభిమానాన్ని వీరభద్రరావు సంపాదించారు. అందుకే ఆయన ఐదేళ్లూ చక్రం తిప్పారు. ఇప్పుడు రిటైరైపోయి.. సంపాదించుకున్న సొమ్ముతో హాయిగా బతికేద్దామనుకుంటున్నారు. ఈయనపై చర్యలు ఉంటాయనుకున్న వేధింపులకు గురైన అధికారులు… ఇలా సింపుల్ గా వెళ్లిపోతూండటంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.