ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హామీలను అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని..ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాలని కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
వినుకొండలో జరిగిన హత్యోదంతం ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన జగన్.. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల గురించి అక్కడ ప్రస్తావించారు. వెంటనే హామీలను అమలు చేయలన్నట్టు మాట్లాడటంతో … పరామర్శలోనూ రాజకీయాలేనా అంటూ జగన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Also Read : ఆలూ లేదు చూలూ లేదు.. కానీ వైసీపీ చీప్ పబ్లిసిటీ..!
ఎన్నికల్లో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ గ్యారంటీలు ఏమయ్యాయని..వైసీపీ నేతలు హామీల అమలుపై ఇప్పటికే కూటమి సర్కార్ ను నిలదీస్తున్నారు. తల్లికి వందనం ఇంకెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. హామీలను అమలు చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించడం వైసీపీకి షాక్ ఇవ్వడమే.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే అద్భుతాలు జరగవని.. హామీలు నెరవేర్చేందుకు సమయం ఇవ్వాలన్నారు వాళ్లు సంపద సృష్టించిన తర్వతా ఇస్తామని అన్నారని, అందువల్ల సంపద సృష్టించడానికి సమయం ఇవ్వాలని.. సంపద సృష్టించిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి మాట్లాడాలన్నారు. వైసీపీ పెద్దఎత్తున అప్పులు చేసిందని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు వారు కూడా అదే చేస్తున్నారని మండిపడ్డారు.