అమెరికా వీసా రిగ్గింగ్ స్కామ్ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అమెరికాలో ఐటీ సంస్థలను నడుపుతున్న ఆయన H1B వీసాలను పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసినట్లుగా అమెరికా అధికారులు కేసులు నమోదు చేసినట్లుగా కొన్ని బిజినెస్ పత్రికలు వెల్లడించాయి. కన్సల్టింగ్ సంస్థల్ని పెట్టుకుని తక్కువ జీతాలు చెల్లిస్తూ.. వీసా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లుగా ఇటీవల కొన్ని సంస్థలపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఉంది.
కంది శ్రీనివాస్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత కాదు. అమెరికాలో సంపాదించుకుని వచ్చేశానని ఆదిలాబాద్‌లో ఎన్నికలకు ముందు హడావుడి చేశారు. మొదట బీజేపీ లో చేరారు. బీఎల్ సంతోష్ తో దిగిన ఫోటోలతో హంగామా చేశారు. అయితే బీజేపీలో చాన్స్ రాదనుకున్నారేమో కానీ.. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి హడావుడి చేశారు. టిక్కెట్ ప్రకటించడానికి ముందే.. పెద్ద ఎత్తున తాయిలాలు పంచారు. ఓ సారి దొరికిపోయారు.
Also Read : రేవంత్ ఎవరిపై అనర్హతా వేటు వేయించబోతున్నారు ?
అయితే ఆయనకే టిక్కెట్ లభించింది. కానీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన వ్యవహారశైలిపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆయన పేరు వీసా స్కామ్ లో బయటకు రావడంతో కలకలం రేగుతోంది.