వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు మకాం మార్చబోతున్నారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. బెంగళూరుకు వెళ్లిన ఆయన మూడు రోజుల కిందట ఏపీకి వచ్చారు. ఎందుకంటే.. పాస్ పోర్టు రెన్యూవల్ కోసం. నిజానికి ఆయన పాస్ పోర్టు కోర్టు దగ్గర ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే… కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాలి. సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిప్లొమాట్ పాస్ పోర్టు తీసుకున్నారు. ఇప్పుడు పదవి పోయింది కాబట్టి ఆ పాస్ పోర్టు పని చేయదు. పాత పాస్ పోర్టును రెన్యూవల్ చేయించుకున్నారు.
జగన్ బెంగళూరునూ అంత సేఫ్ గా భావించలేకపోతున్నారని.. ఏదో ఓ కారణం చెప్పి… విదేశాలకు మకాం మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి లండన్‌లో కొన్ని ఏర్పాట్లు జరిగాయని చెబుతున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లోనే ఉంటారు. వారి కోసం నివాసం.. ఇతర సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారని… జగన్ కొంత కాలం అక్కడే ఉండాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఆరోగ్యం.. చికిత్స.. ఇతర కారణాలతో కోర్టు నుంచి లాంగ్ పర్మిషన్ తీసుకునేందుకు త్వరలోనే పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు పోరాడేదేమీ ఉండదని.. తమ పాలనలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేయించడానికి పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టత రావడతోనే .. జగన్ సేఫ్ జోన్ కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరో నెల రోజుల్లో ఆయన లండన్‌కు లేదా మరో ప్రాంతానికి లాంగ్ లీవ్ లో వెళ్లడం ఖాయమని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకుని ఆయన శుక్రవారం బెంగళూరు వెళ్లిపోతున్నారు.