ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని.. కోర్టులో కొట్టి వేస్తారని తెలిసి కూడా చంద్రబాబు వర్గీకరణ చేసి వారి మధ్య చిచ్చు పెట్టారని జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ కంటెంట్ గా మారాయి. సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి పని ఇప్పుడు రివర్స్ అవుతోంది. అన్న మాటలు ఆయనకే తగులుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని.. చంద్రబాబు కోర్టుల్లో కొట్టి వేస్తారని తెలిసి వర్గీకరణ తెచ్చారని జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం చెప్పింది.
Read Also : చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ – మందకృష్ణ
సుప్రీంకోర్టు తీర్పు .. వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. దళిత వర్గాల్లో ఇప్పటికే జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంటే.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆయన వ్యతిరేకం కావడం మరింత మైనస్ గా మారింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించకుండా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తో ప్రెస్ మీట్ పెట్టించిన ఆయన… అనేక అనుమానాలు లేవనెత్తేలా చేశారు. అంటే.. వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తి స్థాయిలో స్వాగతించలేదు. ఎప్పట్లాగే అడ్డగోలు వాదనతో రాజకీయం చేసేందుకు రెడీ అవుతోంది.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేవారు చాలా స్వల్పంగానే ఉన్నారు. మాల వర్గం కూడా ఇప్పుడు గతంలోలా వ్యతిరేకించడం లేదు. జనాబా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కాలని అనుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపైనా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తే… దళిత వర్గాలు కూడా పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.