వైసీపీ అధినేత జగన్ రెడ్డి మళ్లీ బెంగళూరు వెళ్లారు. 40రోజుల వ్యవధిలోనే ఆయన నాలుగుసార్లు బెంగళూరు వెళ్ళడం గమనార్హం. తరుచుగా ఆయన ఎందుకు బెంగళూరు వెళ్లి వస్తున్నారని వైసీపీ నేతల్లోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత మంగళవారమే బెంగళూరు వెళ్లిన జగన్ శుక్రవారం తాడేపల్లి తిరిగి వచ్చారు. ఇక, ఇప్పట్లో ఆయన బెంగళూరు వెళ్ళరని పార్టీ శ్రేణులతో వరుసగా భేటీ అవుతారని.. గతంలో నిర్వహించాలని ప్లాన్ చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు ఆశించాయి. కానీ, ఆయన మాత్రం తాడేపల్లి టూ బెంగళూరు అంటూ వరుస పర్యటనలు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది.
Also Read :ధర్మాన.. రాజకీయాలకు దండం పెట్టబోతున్నారా?
జగన్ ఇలా వరుసగా బెంగళూరు వెళ్లి వస్తున్నారంటే ఏదో మతలబు ఉండి ఉంటుందని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణంగా అయితే ఉన్నపళంగా జగన్ తరుచుగా బెంగళూరు వెళ్ళరని , ఈ వరుస పర్యటనల వెనక ఏదో రాజకీయ ఎజెండా ఉండి ఉంటుందన్న టాక్ నడుస్తోంది.
జగన్ బెంగళూరు పర్యటన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతున్నారు. అక్కడ ఎవరినైనా కలుస్తున్నారా అనే విషయాలను కూడా బయటకు రానివ్వడం లేదు. జగన్ బెంగళూరు పర్యటనలో ఎలాంటి రాజకీయం లేదని వైసీపీ వర్గాలు అంటున్నా.. ఆయన వరుసపెట్టి బెంగళూర్ చక్కర్లు కొడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.