డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అక్కడ లోకల్ బాయ్. అయితే ఈ ఈవెంట్ కి ఆయన వెళ్ళలేకపోయారు. ఫైనల్ మిక్సింగ్ పనుల్లో ముంబైలో వున్నారు. అయితే ఒక వీడియో బైట్ సెండ్ చేశారు. ఈవెంట్ కి రాలేకపోయినందుకు సారీ చెప్పారు.
”వైజాగ్ లోనే తిరిగేవాడిని. అక్కడ ప్రతి థియేటర్ లో సినిమా చూశాను. ఆ సినిమా పిచ్చి తగ్గక డైరెక్టర్ ని అయ్యాను. సినిమా పెద్ద హిట్ అయ్యాక వైజాగ్ వచ్చి పర్సనల్ గా మీ అందరినీ కలుస్తాను. గల్లీలో తిరిగినవాడిని. ఇది నేను తీసిన గల్లీ సినిమా. సీ సెంటర్లో సీటులు వేస్తూ చూడాల్సిన సినిమా’ అని తనదైన స్టయిల్లో చెప్పుకొచ్చారు పూరి.