వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే ప్రభుత్వ శాఖలో కీలకమైన ఫైల్స్ మాయం అయ్యాయి. వాటన్నింటిని వైసీపీ పెద్దల ఆదేశాల మేరకే అధికారులు మాయం చేశారనేది ఓపెన్ సీక్రెట్. తమ బాగోతాలు బయటకు వస్తాయని నేతలే ఈ ప్లాన్ చేశారు. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా దహనం చేశారని ఆరోపణలు వస్తుండగా.. తాజాగా రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) కార్యాలయంలోనూ ఫైళ్లు కనిపించడం లేదనే వార్త కలకలం రేపుతోంది.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సీఆర్డీయేను ఏర్పాటు చేయగా… 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి హయంలోని అధికారులు ఈ సంస్థకు చెందిన ఈ ఫైల్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రాజధాని నిర్మాణంకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, అప్పట్లో జరిగిన ఒప్పందాలు వంటి వివరాలతో ఈ ఫైళ్ళను కార్యాలయంలో భద్రపరిచారు.
అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, లోకేష్ లతోపాటు మరికొంతమంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడమే లక్ష్యంగా సీఆర్డీయేకు చెందిన ఫైల్స్ పరిశీలన జరిగింది. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసులు కూడా నమోదు చేశారు. ఆ ఫైల్స్ కోసం అధికారులు ఇప్పుడు వెతుకులాటలో ఉండగా అవి దొరకడం లేదని వార్తతో ..వాటిని వైసీపీ సన్నిహిత అధికారులు తిరిగి సీఆర్డీయే ఆఫీసులో తిరిగి అప్పగించలేదని తెలుస్తోంది.
అయితే ,కూటమి అధికారంలోకి తేలగానే ఫైల్స్ దొంగతనం జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. సచివాలయంలో కీలకమైన ఫైల్స్ బయటకు వెళ్ళినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కీలకమైన సీఆర్డీయేకు చెందిన ఫైల్స్ కనిపించకపోవడంతో ఈ ఫైల్స్ వైసీపీ నేతలే మాయం చేసి ఉంటారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఇంకా ఏయే విభాగాల్లో ఫైల్స్ మాయం అయ్యాయో గుర్తించి సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది.