జనసన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారంతో ముగస్తుంది. గతం కన్నా దాదాపుగా నాలుగు లక్షల మంది ఎక్కువగా క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకూ పది లక్షలకుపైగా సభ్యులు క్రియాశీలక కార్యకర్తలుగా నమోదు చేసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన సభ్యులకు ఇన్సూరెన్స్ తో పాటు పలు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
జనసేన పార్టీ ప్రారంభం నుంచి ఆ పార్టీకి ఆరు లక్షల మందికిపైగా క్రియాశీలక సభ్యులు ఉన్నారు, అలాగే సభ్యత్వం లేకపోయినా పార్టీ కోసం విస్తృతంగా పని చేసేవారికి కొదవ లేదు. అయితే వారందర్నీ ఏకతాటిపైకి తీసుకు వచ్చి క్యాడర్ గా మార్చి.. వారి సేవల్ని ప్రభావవంతంగా ఉపయోగించుకునే పార్టీ వ్యవస్థను ఇంకా పకడ్బందీగా నిర్మించుకోలేకపోయారు. అందుకే ఈ సారి పార్టీ వ్యవస్థను నిర్మించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నామినేటెడ్ పోస్టులతో పాటు స్థానిక ఎన్నికల్లో పోటీకి పెద్ద ఎత్తున అవకాశాలు లభించే చాన్స్ ఉండటంతో జనసేన కోసం పని చేసిన వారంతా సభ్యత్వాలు తీసుకుంటున్నారు . కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలకు కూడా పదవులు వుచ్చే అవకాశం ఉండటంతో.. పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.