రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి తన జీతం మొత్తాన్ని గిరిజన ఆస్పత్రుల్లో ఇన్వర్టర్లు, బ్యాటరీలు కొనడానికి వినియోగించారు. ఈ మేరకు ఆమె జీతం రాగానే కొనుగోలు చేసి ఆస్పత్రులకు పంపించారు. నిజానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అదే చేస్తారు కానీ మరియాల శిరీషాదేవి అలా చేయడం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఆమె నిరుపేద. అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తూ.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతబాబు లాంటి వ్యక్తికి భ యపడకుండా అక్కడి ప్రజలు శిరీషా దేవికి ఓట్లేసి గెలిపించారు.
శిరీషాదేవి గతంలో అంగన్ వాడి టీచర్ గా ఉండేవారు., ఆమె భర్త తెలుగు యువత నాయకుడు. ఈ కారణంతో ఆమెను వేధించారు. రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేసి.. తమకు కావాల్సిన వారిని అనంతబాబు మనుషులు నియమించుకున్నారు. అదే ఆమెలో పట్టుదల పెంచింది. భార్యభర్తలు ఇద్దరూ పూర్తి స్థాయిలో తెలుగుదేశం కోసం పని చేశారు. వారి పనితీరు టీడీపీ అధినేత దృష్టిలో పడింది. ఆర్థిక సామర్థ్యం గురించి ఆలోచించకుండా వారికే టిక్కెట్ ఇచ్చారు. 30 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు.
చంద్రబాబు నమ్మకాన్ని మిరియాల శిరీషా దేవి వమ్ము చేయలేదు. కష్టపడి మంచి మెజార్టీతో గెలిచారు. తొలి జీతం దాదాపుగా రెండు లక్షలు వచ్చినా వాటితో … తమ కుటుంబ ఖర్చులు తీర్చుకోవాలని అనుకోలేదు. గిరిజనబిడ్డ ఆస్పత్రులకు ఇన్వర్టర్లు బ్యాటరీల కోసం ఖర్చు పెట్టేశారు.