కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుది.. రేవంతే సీఎంగా ఉంటారని కొద్ది రోజుల కిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ ప ్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కోమటిరెడ్డిని కూడా రేవంత్ సీఎం మెటీరియల్ అని ప్రశంసించారు. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ టర్మ్ ను పదేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు పెంచారు. కాంగ్రెస్ ఇరవయ్యేఏళ్లు అధికారంలో ఉంటుందని ఇరవయ్యేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని ఆయన చెప్పుకొస్తున్నారు.
తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించడం లేదని కోమటిరెడ్డిచెబుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలు 175కు పెరిగే ఛాన్స్ ఉందని.. అందులో తాము 135 సీట్లు గెలుచుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జోస్యం చెప్పుకున్నారు.
Read Also : జగన్ భజన చేస్తున్న కోమటిరెడ్డి – పెద్ద ప్లానే !
బీఆర్ఎస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి, పొంగులేటిని టార్గెట్ చేసుకుంటున్నారు. వారిద్దరూ కలిసి రేవంత్ పై కుట్ర చేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ఇటీవల కొంత మంది సీనియర్లు హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకోవడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. రేవంత్ నిర్ణయాలకు పూర్తి స్థాయిలో అడ్డం పడుతున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ వంటి పదవుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే బయట మాత్రం .. ఆ విబేధాలు కనిపించకుండా చూసుకుంటున్నారు.