పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరి చదువు చారెడు బలపాలు దోసెడు అన్నట్టు ఉంది. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం బెట్టు చేస్తుండగా.. సాధారణ ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు సీఎం స్థాయితో సమానంగా సెక్యూరిటీ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించడం విమర్శలకు తావిస్తోంది.
సమస్యలు తీర్చుతాడని పులివెందుల ప్రజలు జగన్ ను ఎమ్మెల్యేగా గెలిపించారు కానీ, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరు అవుతా..లేదంటే అసెంబ్లీ గడప తొక్కను అంటూ మారం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. శాసన వ్యవహారాలకు సంబంధించి న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. అయినా తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : రెడ్ బుక్ వర్సెస్ రాజారెడ్డి రాజ్యాంగం !
ఈ విషయం ఇంకా తేలనేలేదు..అప్పుడే మరో అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రత తగ్గించారని ..900 మందితో సెక్యూరిటీ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా జగన్ తను సీఎం అని ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. అందుకే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
అయితే..ఈ విషయంలో హైకోర్టు నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే జగన్ నిర్ణయం ఏంటనే చర్చ జరుగుతోంది. ఎలాగైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని అన్నాడో..ఇప్పుడు 900మందితో భద్రత కల్పించకుంటే తను ఏపీకి రానని మొండికేస్తాడా..? అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.