హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కలు ఇప్పుడు అత్యంత లగ్జరీ నివాసం ప్రాంతం ఏది ?. సంప్రదాయవాదులు చాలా మంది బంజరాహిల్స్, జూబ్లీహిల్స్ , గచ్చిబౌలి గురించి చెబుతూంటారు. కానీ ఇప్పుడు అవి మామూలు ప్రాంతాలు. ఇప్పుడు లగ్జరీ నివాస ప్రాంతం అంటే కోకాపేటలోని నియోపోలిస్. అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని చూస్తే.. హైదరాబాద్‌లో ఉన్న ధనవంతులంతా అక్కడే నివసించబోతున్నారని అర్థమైపోతుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ అత్యంత లగ్జరీ నివాస సముదాయాలు నిర్మిస్తున్నాయి. మై హోమ్ కన్స్ట్రక్షన్స్, ప్రిస్టేజ్, రాజ్‌పుష్ప, శోభ సహా కనీసం పది భారీ నిర్మాణ రంగ సంస్థలు తమ ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టాయి.
Read Also : రియల్ ఎస్టెట్ మోసాల నుంచి రక్షణ “రెరా” !
530 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ చేపట్టిన ఈ లేఅవుట్ ఐటీ కారిడార్లోనే అత్యాధునిక మౌలిక వసతులు కోకాపేటలో ఏర్పడనున్నాయి. నియోపోలిస్‌లో 150 అడుగుల నుంచి మొదలు కొని 120,100 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్లను నిర్మిస్తూ, వాటి చుట్టూ బాక్స్ డ్రెయిన్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. దీని వల్ల భవిష్యత్తులో కేబుల్స్ కోసం ప్రత్యేక తవ్వకాలు చేపట్టకుండా బాక్స్ డ్రెయిన్ ద్వారా ఎలాంటి కేబుల్స్ అయినా తీసుకువెళ్లేలా లేఅవుట్లో నిర్మాణం చేపట్టారు.
నియోపోలీస్ లేఅవుట్‌కు ఒకవైపు ఔటర్ రింగు రోడ్డు, మరోవైపు మెహిదీపట్నం-శంకర్పల్లి వెళ్లే ప్రధాన రహదారులు ఉండగా వీటిని కలుపుతూ లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఓఆర్ఆర్ మీదుగా వచ్చే వాహనాలు నియోపోలీస్ లేఅవుట్లోకి వచ్చేందుకు వీలుగా ట్రంపెట్‌ను నిర్మిస్తున్నారు. నియోపోలీస్ కు నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా సబ్ స్టేషన్‌తో పాటు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్ వచ్చే 7 ఏళ్లలో లగ్జరీ ఏరియాల్లో ఒకటిగా మారనుంది.