అమరావతిలోని మీడియా సిటీలో యూట్యూబ్ అకాడెమీ పెట్టేలా గూగుల్ ను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతి మీడియా సిటీ గురించి, అందుబాటులో ఉండే క్వాలిటీ మ్యాన్ పవర్ గురించి వివరించారు. యూట్యూబ్ ఆకాడెమీ ద్వారా లోకల్ పార్టనర్లతో కలిసి కంటెంట్, స్కిల్ డెలవప్మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై పని చేయవచ్చని సూచించినట్లుగా చంద్రబాబు సోషల్ మీడియాలో తెలిపారు.
Also Read : ఫేక్ న్యూస్‌లపై స్పెషల్ కేసుల డ్రైవ్ ?
ఇప్పడంతా యూట్యూబ్ రాజ్యం నడుస్తోంద. వచ్చే కాలంలో ఎలక్ట్రానిక్ మీడియాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. పూర్తిగా డిజిటల్.. యూట్యూబ్ ఆధారిత మీడియాలే ఉండనున్నాయి. కంటెంట్ క్రియేటర్లకు డబ్బులు వస్తూండటంతో ఉపాధి పొందేవారు కూడా ఎక్కువగా మారారు. యూట్యూబర్లకు ప్రత్యేకమైన శిక్షణతో పాటు కంటెంట్ క్రియేషన్‌లో సాయం చేసేందుకు యూట్యూబ్ అకాడెమీలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటి వరకూ యూట్యూబ్ తమ ఆకాడెమీల్ని ఎక్కడా పెట్టినట్లుగా లేదు. కానీ యూట్యూబర్లకు కావాల్సిన సహకారం అందించేందుకు ప్రత్యేకమైన శిక్షణా తరగతులు మాత్రం ఆన్ లైన్ లో నిర్వహిస్తూ ఉంటుంది. చంద్రబాబు పిలుపు మేరకు యూట్యూబ్ ఆకాడెమీపైప గూగుల్ ఆలోచన చేస్తే.. మొదటగా అమరావతికే చాన్స్ వచ్చే అవకాశం ఉంది.