బంగ్లాదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తరిమేసి.. పార్లమెంట్ ను రద్దు చేసి మైక్రో ఫైనాన్స్ ఎక్స్ పర్ట్ అయిన నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్‌ను గద్దెపై కూర్చోబెడుతున్నారు. యూనస్ గొప్పవాడా.. అమెరికా తొత్తా లాంటి అంశాలను పక్కన పెడితే.. అధ్యక్షుడు అవడానికి ఆయనకు ఉన్న అర్హత ఏంటి అన్నది మాత్రం.. ఎవరికీ తెలియదు. ప్రజలు ఎన్నుకోలేదు.. పార్లమెంట్ లేదు. కానీ ఉద్యమం చేసిన విద్యార్థులు డిమాండ్ చేశారని ఆయనను ప్రధానిగా ప్రమాణం చేయిస్తున్నారు.
నిజానికి బంగ్లాదేశ్… బాగా పురోగమిస్తున్న దేశం. ఉపఖండంలోని శ్రీలంక, పాకిస్థాన్, అప్ఘనిస్తాన్ వంటి దేశాలు సంక్షోభాలతో అల్లకల్లోలం అవుతూంటే మొండికిపడి మరీ బంగ్లాదేశ్ వృద్ధి పధంలో సాగుతోంది. అక్కడి వస్త్ర పరిశ్రమ నిరంతరం వృద్ధిలో ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. భారత్ కంటే వృద్ధి రేటు ఎక్కువగా ఉందని కూడా రిపోర్టులు వచ్చాయి. కారణం ఏదైనా బంగ్లాదేశ్ శ్రీలంక, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ కంటే.. ఎంతో ముందు ఉంది. కానీ ఇప్పుడు ఆ దేశాల పక్కన చేరుతోంది.
Also Read : బంగ్లాదేశ్ ఇష్యూపై భారత్ కీలక ప్రకటన
బంగ్లాదేశ్ లో ఏర్పడిన దుస్థితి కారణంగా అక్కడ అంతర్జాతీయ పెట్టుబడిదారులెవరూ మరోసారి పెట్టుబడులు పెట్టేందుకు సాహసించరు. అభివృద్ధి చెందుతున్న వస్త్ర పరిశ్రమ.. ఇతర రంగాలు కుదేలయితే.. అది అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తుంది. పాకిస్తాన్ ప్రజల్లా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా జరిగినా దీనంతటికి కారణం అక్కడి యువతే. బంగ్లాదేశ్ దుస్థితికి ఆలోచన లేని యువతే కారణం.
విదేశీ శక్తులే బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాల వెనుక ఉన్నారని బలమైన అనుమానాలు ఉన్నాయి. హసీనా పారిపోయినా హింస మాత్రం ఆగడం లేదు. ఎందుకు అంటే వారికి కావాల్సింది హసీనా పారిపోవడమే కాదు.. బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధం కూడా. వారి ప్లాన్ బంగ్లా యువత పావులుగా మారి తమ వేలితో తమ కన్ను పొడుచుకుంటున్నారు.