స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు భారీ తాయిలాలు పంచక తప్పని పరిస్థితి బొత్స సత్యనారాయణకు కనిపిస్తోంది. అసలే ఎన్నికల్లో కుటుంబం అంతా ఓడిపోయి .. ఖర్చయిపోయామని కంగారు పడుతూంటే.. జగన్ అడగకపోయినా ఎమ్మెల్సీ సీటిచ్చారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు.. వీరి పట్టుదల చూసి.. ఎంతిస్తారని ప్రశ్నించడం ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లతో జగన్ సమావేశం అవుతున్నారు. అక్కడ వారు తమకు ఎంతిస్తారో చెప్పాలని మొహం మీదనే అడిగేస్తున్నారు.
పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ స్థానిక ప్రతినిధులతో జగన్ బుధవారం సమావేశమయ్యారు. గురువారం మరో మూడు నియోజకవర్గాల వారితో సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు జగన్ అందరికీ ఒకటే క్యాసెట్ వేశారు. ఆయన చెప్పేది ఎవరూ పట్టించుకోలేదు కానీ.. అసలు ఓటేస్తే ఎంతిస్తారని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ ప్రశ్న బొత్సను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. క్యాంపులకు తీసుకెళ్తారని ముందే తెలియడంతో ఓటర్లు కుటుంబాలతో సహా వచ్చేశారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్లారు.
Also read : బొత్స మరోసారి బలిపశువు
వందల మందిని ఇలా విహారయాత్రకు తీసుకెళ్లి దాదాపుగా ఇరవై రోజుల పాటు చూసుకోవాల్సి ఉంటుంది. ఓటర్లే కాదు.. వారి కుటుంబసభ్యులు కూడా రావడంతో పెనుభారంగా మారుతోంది. ఇంతా చేసి రెండు, మూడు లక్షలన్నా ఇవ్వకపోతే వారు ఓటేసే అవకాశం లేదు. మరో వైపు టీడీపీ కూటమి అధికారంలో ఉంది. వారు డబ్బులివ్వకపోయినా వారితో పనులుంటాయి. అందుకే ఓట్లేస్తారన్న నమ్మకం కూడా లేదు. అయినా బొత్సకు.. ఈ ఎన్నికతో యాభై కోట్ల వరకైనా వదిలే అవకాశం ఉందని అంటున్నారు. అయితే జగన్ తాను చూసుకుంటానన్నారు కాబట్టి బొత్స నింపాదిగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.