గతమెంతో ఘన చరిత్ర ఉన్న భారత హాకీ జట్టు మరోసారి ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో స్పెయిన్ పై ఘన విజయం సాధించి.. పతకం పట్టేసింది. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు స్పెయిన్ గట్టి పోటీ ఇచ్చింది. చివరి క్షణాల్లో అయినా వీరోచితంగా పోరాడి పతకాన్ని ఒడిసి పట్టుకున్నారు.
గత ఒలిపింక్స్‌లోనూ హాకీ టీం కాంస్య పతకాన్ని సాధించింది. వరుసగా రెండో కాంస్య పతకం గెలవడంతో భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. గ్రేట్ ఆఫ్ వాల్ ఆప్ ఇండియాగా పేరు తెచ్చుకునన గోల్ కీపర్ శ్రీజేష్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించారు.
Also Read : ఒలింపిక్స్ : లక్ష్యసేన్‌కు నిరాశ – హకీ టీం సూపర్
ఒకప్పడు ఒలిపింక్స్ లో భారత్ హాకీ టీం హాట్ ఫేవరేట్. బరిలోకి దిగితే గోల్డే. ధ్యాన్‌చంద్ యుగంలో వరుసగా బంగారు పతకాలు సాధించి సత్తా చాటిన భారత ఒలింపిక్ జట్టు ఆ తర్వాత గాడి తప్పింది. భారత్‌కు నాలుగు దశాబ్దాల పాటు అసలు ఒలింపిక్ పతకమే లేకుండా పోయింది. ఆ నిరీక్షణకు తెరదించుతూ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకంతో మెరిసింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాన్ని సాధించి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
భారత్‌కు స్వర్ణం ఆశ ఇంకా మిగిలి ఉంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్ జరగనుంది.