విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కీలక మలుపులు తిరుగుతోంది. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా జగన్ రెడ్డి మరోసారి తనను బలి పశువును చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నికలు ఎలా గెలవాలో జగన్ .. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడే చూపించారు. ఇప్పుడు అంతకు మించి చేయడానికి టీడీపీకి అవకాశం ఉంది. ఎంత ఏడ్చినా ఓటమి ఓటమే. అందుకే బొత్స పోటీకి ఆసక్తి చూపించలేదు. అంతా తాను చూసుకుంటానని జగన్ చెప్పి పోటీకి దించారు.
ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం రమేష్ కు బాధ్యతలిచ్చారు. ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో బొత్సకు తెలియనిదేం కాదు.అందుకే పరువు కాపాడుకునే ఓట్లు కూడా రావని ఆయన ఫీలవుతున్నారు. మరి జగన్ ఏమైనా ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారా అంటే… ఓటర్లను తన వద్దకు పిలుచుకు రావాలని పురమాయిస్తున్నారు. వచ్చిన వారందరికీ.. పాత క్యాసెట్ వేస్తున్నారు. ఆ సోది విని వైసీపీకే ఎందుకు ఓటేయాలని వారు అనుకోవడం లేదు.
Read Also : ఎమ్మెల్సీ ఎన్నిక- కూటమి ముందు బొత్స నినాదం పనిచేస్తుందా?
జగన్ తో సమావేశాలకు మూడు వందల మంది స్థానిక సంస్థల ఓటర్లు కూడా హాజరు కాలేదు. కుటుంబసభ్యులను కూడా పిలిపించడంతో సమావేశం నిండుగా కనిపిస్తోంది. ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ వారిలో చాలా మంది టీడీపీ క్యాంపులో ఉన్నారు. సమావేశానికి వచ్చిన వారు కూడా వైసీపీకి ఓటేస్తారని లేదు. క్యాంపులు పెట్టాలంటే చాలా ఖర్చవుతుంది కాబట్టి బొత్స రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. కుదిరితే చివరి క్షణంలో అయినా వేరే అభ్యర్థిని పెట్టి తాను వైదొలగాలని అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక ఓటర్లతో జగన్ నిర్వహించిన సమావేశాల్లోనూ బొత్స యాక్టివ్ గా కనిపించలేదు.