అవును.. వైఎస్ షర్మిల వైసీపీ సోషల్ మీడియా ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో విత్తనాల కొరత ఉందంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారానికి షర్మిల కూడా జతకలిసి కోరస్ వినిపించారు. నిజంగానే రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల కొరత ఉందా..? అంటే అలాంటి పరిస్థితి రాకుండా సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే 5.1 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించారు. ఇంకా విత్తనా పంపిణీ కొనసాగుతూనే ఉంది. అయితే, పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేట్ వ్యాపారి తెలంగాణ నుంచి తెచ్చి విక్రయిస్తోన్న విత్తనాల కోసం కొంతమంది రైతులు ఎగబడ్డారు. కారణం ..ఆ విత్తనాలకు డిమాండ్ ఉండటమే. అయితే, అంతకంటే మేలైన రకం విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. కానీ, కొంతమంది రైతులు తెలంగాణ నుంచి తెచ్చిన విత్తనాల కోసం ఎగబడటంతో..దాన్ని విత్తనాల కొరత కింద జమ కట్టేసింది వైసీపీ సోషల్ మీడియా.
Also Read : రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్
ఫేక్ ప్రచారం సృష్టించడంలో సిద్దహస్తులు అయిన వైసీపీ సోషల్ మీడియా విభాగం.. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. జగన్ అధికారంలో కోల్పోయాక విత్తనాల కొరత మొదలు అయిందంటూ దుష్ప్రచారం మొదలు పెట్టింది. కానీ, జగన్ హయాంలో విత్తనాల కొరతే లేదన్నట్లుగా వైసీపీ ప్రచారం చేయడం, అయినా ఎక్కడా విత్తనాల కొరత కనిపించకపోవడంతో ఎవరూ ఈ ప్రచారాన్ని పట్టించుకోలేదు.
కానీ, షర్మిల మాత్రం రాజకీయం చేసేందుకు ఇదొక అవకాశం అనుకున్నారేమో , వెంటనే విత్తనాల కొరత అంటూ కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రి అచ్చెన్నా.. విత్తనాల కొరత వచ్చేందుకు ఇది మీ అన్నయ్య పాలన కాదంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా విత్తనాల కొరతపై వైసీపీకి కోరస్ వినిపించి షర్మిల అపవాదును మూటగట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.