వైసీపీ నేతలు డిసైడైపోయారు. ఆ పార్టీలో ఉండటం కన్నా రాజకీయ సన్యాసం తీసుకుని ఖాళీగా ఉండటం మంచిదని తేల్చేసుకున్నారు. ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీలలో చోటు లేకపోయినా ఎవరూ ఆగడం లేదు. జగన్ రెడ్డి పైత్యాన్ని ఇక తాము భరించలేమని ఇంత కన్నా ఘోరంగా ప్రజలు మను విచిత్రంగా.. జాలిగా చూస్తూంటే తట్టుకోలేమని ఎక్కువ మంది ఫీలైపోయి దండం పెట్టేస్తున్నారు. వైసీపీ నేతల్లో నోరు జారని నేత.. అంతో ఇంతో గౌరవాన్ని కాపాడుకున్న లీడర్ ఆళ్ల నాని అదే పని చేశారు. అంతకు ముందు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో చోటు లేకపోయినా పార్టీకి గుడ్ బై చెప్పారు.
కిలారు రోశయ్య, మద్దాలి గిరి, పెండెం దొరబాబు, ఆళ్ల నాని ఈ జాబితా బయటకు కనిపిస్తోంది. కానీ అసలు పార్టీ కార్యక్రమాలకు జోలికి రాని నేతలు ఎంతో మంది ఉన్నారు. ప్రజల్లోకి రావాలంటేనే భయపడేలా జగన్ రెడ్డి చేస్తున్నారు. ఎప్పుడూ శవరాజకీయాలేనా… ప్రజలు ఘోరంగా ఓడించినా ఎందుకు మారడం లేదనే ప్రశ్నలు తమకు వస్తే ఎం సమాధానం చెప్పాలో వారికి అర్థం కావడం లేదు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఘోరంగా నానశం చేశారు.. ప్రజల బతుకుల్ని ఆగం చేశారు.. ఓడిపోయిన తర్వాత కూడా మారరా అన్న కామెంట్లకు సమాధానం చెప్పలేక పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
ఒక్క సారి అధికారం ఇస్తే ప్రజల ఆస్తిపాస్తులుకు భరోసా లేకండా చేశారు. శాంతిభద్రతలు అంటే.. వైసీపీ నేతలు ఏం చేసినా భరించాలన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడా వైసీపీ నేతలు కూడా జగన్ పిచ్చి తనాన్ని భరించలేకపోతున్నారు. మరో రెండు మూడు నెలల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరంతా కూటమి పార్టీల్లో సర్దుకోబోతున్నారు. మిగిలిన వారు రాజకీయాల నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. అందుకే ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పి కొంత కాలం ఖాళీగా ఉన్నా… తదుపరి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు.