ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతల అక్రమ సంబంధాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. వీరందరికీ జగన్ మంచి ప్రోత్సాహం ఇచ్చారు. వైఎస్ జగన్ అత్యంత ఎక్కువగా అభిమానించిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. అచ్చెన్నాయుడును ఆయన తిట్టే బూతులతో జగన్ మెచ్చారు. అందుకే ఆయన వివాహేతర బంధాల్లో ఇరుక్కున్నారని తెలిసినా ప్రోత్సహించారు. ఆయన భార్య.. తన పార్టీ జడ్పీటీసీ అయిన నేతకు అన్యాయం చేశారు. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం చెప్పాల్సిన పని లేదు. ఆయనకు డీఎస్ఏ టెస్టు చేయిస్తే బాగోతానికి సర్టిఫికెట్ వస్తుంది.
వైసీపీ అధినేత జగన్ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయన ఇలాంటివి చేయడాన్ని అదనపు అర్హతగా భావిస్తున్నారు. గంట సేపు అంటూ అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటపడి పెద్ద దుమారం రేగిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అరగంట టేపులు వెలుగు చూసిన తర్వాత కూడా అవంతి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
గోరంట్ల మాధవ్ ను వెనకేసుకొచ్చేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ప్రోత్సహించారు. ఇంకా బయటపడని అనేక మంది లీడర్ల వ్యవహారాల గురించి జగన్ కు పూర్తిగా తెలుసని.. అయితే అదే వైసీపీ లీడర్ లక్షణమని ఆయన అనుకోవడంతోనే సమస్య వస్తోంది. అయితే ఆ సమస్యను జగన్ ఫీల్ కావడం లేదు. తమను నమ్మే జనం ఖర్మ అని వదిలేస్తున్నారు.