హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విషయాల్లో ఐటీ కారిడార్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ హైదరాబాద్ నలు వైపులా ఇండెక్స్ అద్భుతంగా ఉంటోంది. మేడ్చల్ వైపు.. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. కొంపల్లి, మేడ్చల్, శామీర్‌పేట అద్భుతమైన అభివృద్ధి సాధించే జాబితాలో చేరాయి. మేడ్చల్ ప్రాంతంలో పెట్టుబడి పెడితే చక్కని వృద్ధితో భారీ రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి.
మేడ్చల్ వైపు పెద్ద ఎత్తున కాలనీలు ఏర్పాటవుతున్నాయి. వేగంగా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తూండటంతో పెద్ద ఎత్తున జనం అటు వైపు నివాసం ఉండేందుకు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇటు వైపు భూములు, ఇళ్లు బడ్జెట్ ధరలో వస్తున్నాయి. మేడ్చల్ చుట్టుపక్కల ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, ఐటీ కారిడార్‌కు వేగంగా చేరుకునేందుకు మంచి రహదారి సౌకర్యం కూడా ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఔటర్ రింగ్ రోడ్డు అన్నింటికి మించి బడ్జెట్ ధరలోనే ఇళ్లు అందుబాటులో ఉండడంతో మేడ్చల్ ప్రాంతం ఇప్పుడు కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Also read : జోరుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్
మియాపూర్, బాచుపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి విస్తరించింది. ఇళ్లు, భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బడ్జెట్ ధరలోని ఇళ్ల కోసం చూసే వారు కాస్త దూరమైనా పర్వాలేదనే భావనలో ఉన్నారు. అలాంటి వారు మేడ్చల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ వైపు ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. బహుదూర్‌పల్లి, మైసమ్మగూడ, కొంపల్లి ప్రాంతాలు సైతం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రేట్లు పెరగడంతో మేడ్చల్ వైపు ఎక్కువ మంది చూస్తున్నారు.
పలు ఫార్మా కంపెనీల రీసర్చ్, డెవల్మెంట్ కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. గండిమైసమ్మ చుట్టుపక్కల బాసుర్గడి, గౌడవెల్లి, అయోధ్యక్రాస్రోడ్స్, బహుదూర్ పల్లి, మైసమ్మ గూడ్ ఏరియాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి. కాస్త ఎక్కువ బడ్జెట్ పెడితే లగ్జరీ ఇళ్లు లభిస్తాయి. ఐదేళ్ల తర్వాత అక్కడ ఆ ఇళ్లకు పలికే ధర ఎంత ఉంటుందో ఎవరూ ఊహించలేరు.