మేం అప్పు ఇస్తాం అని కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులు వెంటపడుతున్నాయి. వారి వారి అకౌంట్లలో నగదు జమ, బదిలీల ఆధారంగా ఒక్కొక్కరికీ ఒక్కో అమౌంట్ ఆఫర్ చేస్తుంటాయి. ఇక ఉద్యోగాలు చేసే వారికి అయితే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు అయితే ఇంకా ఎక్కువ.
అప్పులు ఇచ్చే స్టేజ్ నుండి ఇప్పుడు మా బ్యాంకులో డిపాజిట్ చేయండి ప్లీజ్ అని బ్యాంకులు ఇప్పుడు రిక్వెస్ట్ చేయబోతున్నాయి. మా బ్యాంకులో మీ డబ్బును డిపాజిట్ చేయండి… మీకు అదిరిపోయే ఆఫర్స్ ఇస్తాం అని ఫోన్ కాల్స్ కూడా రాబోతున్నాయి. అవును… మీరు చదువుతున్నది నిజమే.
కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులు అప్పులు ఇవ్వటం రీపేంట్ చేసుకోవటమే జరుగుతోంది. డిపాజిట్స్ చేయటం ప్రతి సంవత్సరం బాగా తగ్గిపోతుంది. ఎంతగా అంటే బ్యాంకుల్లో నిల్వలు పూర్తిగా అడుగంటి పోయేలా. దీంతో ఆర్బీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టి… బ్యాంకుల్లో నగదు నిల్వలు చేసుకోవటం, వాటిపై వడ్డీ బ్యాంకుల ఇష్టం. ఆర్బీఐ ఎటువంటి పరిమితులు, షరతులు విధించదు.
తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయంపై స్పందిస్తూ… అప్పులు ఇవ్వటంతో పాటు డిపాజిట్లపై ఫోకస్ చేయాలి. రెండూ బ్యాలెన్స్ కావాలి అంటూ సూచించారు.
అప్పులు తీసుకొని భూములు, బంగారంపై పెట్టే రోజులు ఇవి. అలాంటిది చేతిలో ఉన్న డబ్బును బ్యాంకులో అది కూడా తక్కువ వడ్డీకి పెట్టేందుకు జనం ఎవరూ ముందుకు రారు. మరీ దీనికి బ్యాంకులు తీసుకొచ్చే ఆఫర్స్ ఎలా ఉంటాయో చూడాలి.