ట్రాన్స్ ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్. ఇలాంటి వాటితోనూ భారీ స్కామ్ చేయవచ్చని వైసీపీ నేతలు నిరూపించారు. అధికారం మనదేనని అడ్డగోలుగా దోచుకోవడంలో వారు రాటుదేలిపోయారు. ఎన్ని రకాలుగా దోపిడీ చేయవచ్చే పీహెచ్డీలు చేసినట్లుగా దోచుకున్నారు. అందులో ఈ టీడీఆర్ స్కామ్ ఒకటి.
మున్సిపాలిటీల్లో రోడ్ల విస్తరణకు స్థల సేకరణ చేస్తారు. అందుకు గాను పరిహారం చెల్లిస్తారు. పరిహారానికి బదులు టీడీఆర్ బాండ్లు కూడా తీసుకోవచ్చు. ఈ బాండ్లు అమ్ముకునేందుకు.. వేరే వారికి ట్రాన్స్ ఫర్ చేసుునేందుకు అవకాశం ఉంటుంది. ఈ బాండ్లను పొందిన వ్యక్తికి బాండ్ తీసుకున్న వ్యక్తికి వేరేచోట భవనాలు కట్టుకునేందుకు అనుమతులు ఆ విలువలోనే మినహాయించుకోవచ్చు. అంతేనా టీడీఆర్ బాండ్లు ఉన్న వారికి అదనపు అంతస్తులకు అనుమతి ఇస్తారు. అంటే ఈ బాండ్లు బిల్డర్లకు ఎలా ఉపయోగపడతాయో అంచనా వేయవచ్చు. టీడీఆర్ బాండ్లను వారి పేరు మీద రాయించుకుని ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేసుకోవచ్చు. దాని వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఫీజులు టీడీఆర్ బాండ్లు రాయించుకున్న వారికి పోతాయి.
కాస్త విచిత్రంగా ఉన్న ఈ స్కామ్ ఏపీలో సంచలనం రేపుతోంది. పది రూపాయల విలువ చేయని స్థలాన్ని మున్సిపాల్టీ సేకరిస్తే కోటి రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లను రిలీజ్ చేయించుకున్నారు. ముందుగా తణుకులో ఇది బయటపడింది. తిరుపతిలో వందల కోట్లలో జరిగింది. ఇంకా చాలా చోట్ల ఈ గుట్టు బయటపడుతోంది. అందుకే సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించారు.
ఇందులో ఉన్నది బడా బాబులే. మాజీ మంత్రులే కీలకం. తము చేసిన స్కామ్ లో దొరికిపోయామని చాలా మంది తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారు. ఎవరూ బయటకు రావడం లేదు.