వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను టార్గెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ భరించలేక మనస్తాపంతో ఆత్మహత్యయత్నం చేసిన దివ్వెల మాధురి తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ వివాదం చెలరేగుతుండగానే..మాధురి భర్త ఎవరు..? ఆయన ఏం చేస్తుంటారు..? ఎక్కడుంటారని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడిచింది. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ పై తాజాగా స్పందించారు మాధురి భర్త దివ్వెల మహేష్ చంద్రబోస్.
అమెరికాలో ఉన్న మాధురి భర్త మహేష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ..మాధురికి రాజకీయాలపై ఆసక్తి ఉండటంతోనే ఆమె వైసీపీలో చేరేందుకు అంగీకరించానని చెప్పారు. తనకు మాత్రం రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదన్నారు.
తన భార్యపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న మహేష్ చంద్రబోస్..మాధురి రాజకీయాల్లో ఎదుగుతుందనే అక్కసుతోనే ఆమెపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
దువ్వాడ శ్రీనివాస్ అంగీకరిస్తే పెళ్లికి కూడా సిద్దమని వ్యాఖ్యానించిన మాధురికి మద్దతుగా ఆమె భర్త రంగంలోకి దిగడంతో ఆయనతో ఎవరైనా ఈ కామెంట్స్ చేయించారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.