రోజులు గడిచిపోతున్నాయి కానీ నామినేటెడ్ పోస్టులపై మాత్రం చంద్రబాబు తేల్చడం లేదు. ఇదిగో అదిగో అంటూ టైం పాస్ చేస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలకూ నామినేటెడ్ పోస్టులు అంటూ ప్రకటించడంతో .. ఆ పార్టీలో పని చేస్తారో లేదో తెలియని వారు కూడా పదవుల ఆశతో లాబీయింగ్ ప్రారంభించుకున్నారు. దీంతో నామినేటెడ్ పో్సటుల ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది.
కేబినెట్ ర్యాంక్ తో ఉండే నామినేటెడ్ పోస్టులకు మంచి డిమాండ్ ఉంటుంది. వాటికి మంత్రుల స్థాయిలో పవర్ ఉంటుంది. టీటీడీ చైర్మన్, ఏపీఐఐసీ చైర్మన్ లాంటి పోస్టులకు సీనియర్లు పోటీ పడుతూంటారు. టిక్కెట్లు దక్కని చాలా మంది గట్టి ప్రయత్నాలు చేస్తూండటంతో వారందరికీ ఎలా సర్దుబాటు చేయాలో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్ లో దక్కుతాయనుకుంటున్న పదవులతో పాటు ఇతర ప్రయోజనాలను కలిపి మొత్తం. లీడర్లను శాటిస్ ఫై చేయాలని.. అసంతృప్తి లేకుండా చేయాలని అనుకుంటున్నారు.
ఇప్పటికి అయితే లోకేష్ స్థాయిలో కసరత్తు జరిగిందని నివేదిక చంద్రబాబుకు చేరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన, బీజేపీ ల నుంచి కూడా ఇలాంటి జాబితాలు టీడీపీకి చేరి ఉంటాయని తెలస్తోంది. అయితే .. పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు.. ఎవరూ అసంతృప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా.. చంద్రబాబు తీసుకుంటున్నారు. అందుకే ప్రకటన ఆలస్యమవుతోందని అంటున్నారు.