వైసీపీ నేత దేవినేని అవినాష్ కు అధికారులు షాకిచ్చారు. దుబాయ్ వెళ్లిపోయేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన అవినాష్ ను ఎయిర్ పోర్టు అధికారులు అనుమతించలేదు.
దేవినేని అవినాష్ పై ఏపీలో లుక్ ఔట్ నోటీసులు జారీ అయినందున… అనుమతించటం కుదరదని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దేవినేని అవినాష్ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడిలో ప్రధాన ముద్దాయిల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ముందస్తు బెయిల్ పై ఆయన కొనసాగుతుండగా… ఆ కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
టీడీపీ కార్యాయలంపై దాడి కేసులోనే అవినాష్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ఆ నోటీసులు రాకముందే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందారు.