కరోనా వైరస్ ప్రపంచానికి ఎంత నష్టం చేసిందో దానిపై జరిగిన భయంకరమైన ప్రచారం మా్త్రం ఊహించలేనంత నష్టం చేసింది. అది ఆస్తుల పరంగానే కాదు.. ప్రాణాల పరంగా కూడా. కరోనా సోకిందన్న భయంతోనే ఎంతో మంది చనిపోయారు. అలాంటి పరిస్థితిని మరోసారి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా కాదు.. ఎంపాక్స్ పేరుతో కొత్త వైరస్. దీనికి మంకీపాక్స్‌గా కూడా పిలుస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. మెడికల్ ఎమర్జెన్సీ జారీ చేసింది.
ఆఫ్రికాలో ఈ వైరస్‌తో 500 మంది వరకూ చనిపోయారని చెబుతున్నారు. పలు దేశాలకు ఈ వైరస్ విస్తరించిందని.. మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ ఓ కేసు బయటపడిందని ప్రకటించారు. ఈ వైరస్ సోకితే తీవ్రమైన కండరాల నొప్పి, జ్వరం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోతుల నుంచి ఈ వైరస్ వస్తుందని చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల భారత్ సహా 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కరోనా వైరస్ ను మొదట డబ్ల్యూహెచ్‌వో అంత సీరియస్‌గా తీసుకోలేదు. అప్పట్లో విమర్శలకు గురయింది. అందుకే ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఈ ఎంపాక్స్ పై ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లుగా కనపిస్తోంది. నిజానికి ఈ ఎంపాక్స్ పై మొదటి సారి… మెడికల్ ఎమెర్జెనీని డబ్ల్యూహెచ్‌వో జారీ చేయలేదు..ఇది రెండో సారి. కానీ ఇప్పుడు ఈ వైరస్‌పై ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.