‘కాంతార’లో అద్భుత నట విన్యాసాన్ని ప్రదర్శించిన రషబ్ శెట్టి కి తగిన గౌరవం దక్కింది. ఈ చిత్రానికి గానూ రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ప్రకటించారు. ఇదే చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రంగానూ అవార్డు దక్కింది. ఈ రోజు ఢిల్లీలో 70వ జాతీయ అవార్డుల ప్రకటన కార్యక్రమం జరిగింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. ఈ విభాగంలో మినహాయిస్తే.. తెలుగు సినిమాకు మరో పురస్కారం దక్కలేదు. ఉత్తమ నటి అవార్డు ఈసారి ఇద్దరు పంచుకొన్నారు. తమిళ ‘తిరు’ చిత్రానికి గానూ నిత్యమీనన్, మానసీ పారీఖ్ (కుచ్ ఎక్స్ ప్రెస్ గుజరాతీ) ఉత్తమ నటీమణులుగా నిలిచారు. ‘తిరు’ చిత్రానికి గానూ జానీ మాస్టర్ కు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు దక్కింది. ఈసారి అవార్డుల్లో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఆధిపత్యం ప్రదర్శించింది. ఉత్తమ తమిళ చిత్రం తో పాటుగా నేపథ్య సంగీతం, సౌండ్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కించుకొంది.