కేసీఆర్… ఓడినా గెలిచినా, ఆయన వ్యూహం, ఎత్తుగడలు నెక్ట్స్ లెవల్. కాలం కలిసిరాకపోతే గెలుపోటములు సహజమే. అంతమాత్రాన పెద్దాయన పార్టీని సరైన డైరెక్షన్ లో పెట్టడం లేదనుకోవాలా?
ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాటలు అదే నిజం చేస్తున్నాయి. ఉద్యమ పార్టీగా మొదలై… రాష్ట్ర రాజకీయాలను శాసించి, రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీ టీఆరెఎస్. పది సంవత్సరాల పాలన తర్వాత ఓడిపోయింది. అలాంటి బీఆర్ఎస్ వైసీపీ నుండి నేర్చుకునేందుకు స్టడీ టూర్ కు వెళ్తుందా?
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ పరిస్థితులుంటాయి. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే ఢీ అంటే ఢీ అన్నట్లుగా కలపడ్డాయి. కానీ జయలలిత మరణం శశికళ పార్టీకి దూరం అయ్యాక ఆ పార్టీ గ్రాఫ్ తగ్గింది. కరుణానిధి రాజకీయాల్లో ఉండగానే స్టాలిన్ పార్టీపై పట్టు సాధించారు కాబట్టి ఓ వెలుగు వెలుగుతోంది. ఏపీలో ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉండటం టీడీపీకి ప్లస్. చంద్రబాబు విజనరీని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి గెలిపిస్తున్నారు.
కానీ, తెలంగాణలో రాజకీయాలు వేరు. ఈరోజుకు కేసీఆర్ కు పాజిటివ్ గ్రౌండ్ ఉంది. మొన్నటి ఓటమి బీఆర్ఎస్ నేతల ఓటమే తప్పా కేసీఆర్ ఓటమి కాదు… అనేది గ్రౌండ్ రియాలిటి. మొన్నటి వరకు కేసీఆర్ గెలవాలి కానీ మా ఎమ్మెల్యే ఓడిపోవాలి అని జనం అనుకున్నరు అని ఇదే కేటీఆర్ చెప్తూ వచ్చారు. కానీ సడన్ గా నాతో పాటు సీనియర్లంతా స్టడీ టూర్ కు పక్క రాష్ట్రాలు వెళ్తున్నాం… ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల స్ట్రక్చర్, ఎలా నిలబడ్డారో చూసి వస్తాం అని ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఈ రోజుకు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకపోలేదు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఇంకా బీఆర్ఎస్సే ఉంది. బీజేపీ సీన్ లోకి రావాలన్నా, ఇప్పుడున్నట్లుగానే ఉండాలన్న కేసీఆర్ చేతుల్లోనే ఉంది. పార్టీ నడిపే నాయకుడు జనంలో లేకుండా ప్రజల్లో పార్టీకి పునర్వైభం ఎలా సాధ్యమవుతుంది? బీఆర్ఎస్ ఎంత వెనకబడితే బీజేపీ అంత ముందుకు వస్తుంది అన్నది ఓపెన్ సీక్రెట్.