విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షఫీ నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బొత్స నామినేషన్ ఒక్కటే మిగలడంతో బొత్స ఏకగ్రీవ ఎన్నిక లాంచనం అయింది.
మొదట్లో పోటీలో ఉండాలని కూటమి ఆసక్తి చూపినా చివరికి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించడం, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో బొత్స గెలుపు ఖాయమైంది.
ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.