చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మీడియా ముందు అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అనంతరం మాట్లాడిన జోగి..తన ప్లాన్ ఏంటో చెప్పకనే చెప్పేశారు. జగన్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు అలా చేయాల్సి వచ్చిందని పరోక్షంగా చెప్పేశారు.
అయ్యన్న పాత్రుడు జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దానికి నిరసన తెలిపేందుకు చంద్రబాబు ఇంటికి వెళ్లానన్నారు. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ నేత ఇంటి వద్దే నిరసన తెలపాలని అనుకుంటారు. కానీ, జోగి రమేష్ మాత్రం చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్ళాలనుకోవడం వెనక మతలబు ఎంటి..? జగన్ మెప్పు కోసమే ఇదంతా చేసి ఉంటారని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది.
జోగి వ్యాఖ్యలను చూస్తే..అయ్యన్నపాత్రుడు జగన్ పై చేసిన వ్యాఖ్యలు..చంద్రబాబు ఆదేశాల మేరకు చేశాడు కాబట్టే..బాబు ఇంటి వద్ద నిరసన తెలపాలనుకున్నాననే విధంగా ఉన్నాయి. అదే నిజమైతే ఇటు చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించింది జోగి రమేష్ అయితే, ఈ ప్లాన్ వేసింది జగనే అయి ఉండొచ్చు కదా అనే లాజిక్స్ తెరమీదకు వస్తున్నాయి.
దీంతో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కవర్ చేసుకుకేందుకు ప్రయత్నించి జోగి దొరికిపోయాడు అంటున్నారు. అసలు దాడి ప్లాన్ ఎవరిది? ఎవరి ఆదేశాల మేరకు దాడికి యత్నించారు అని విచారణలో పోలీసులు ఆరా తీసిన వేళ జోగి రమేష్ బయటకు వచ్చి చేసిన ఈ కామెంట్స్ విచారణలో కీలకం కానున్నాయి అంటున్నారు.