వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లుగా భూదోపిడికి పాల్పడిన వారి గుండెల్లో రెవిన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా రైళ్లు పరుగెత్తిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు తగలబడిన తర్వాత ఆయన ఇది ఆషామాషీ స్కాం కాదని గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగారు. వారం రోజుల వరకూ మదనపల్లిలోనే మకాం వేసి చాలా వరకూ గుట్టు బయటకు లాగారు. పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన అరాచకాల గురించి మొత్తం బయట పెట్టారు. ఇక చ్యలు తీసుకోవాల్సి ఉంది.
అయితే ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే కాదని.. అలాంటి వారు రాష్ట్రం మొత్తం ఉన్నారని గుర్తించారు. ముఖ్యంగా ఆసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లుగా గుర్తించారు. వేల ఎకరాలు ఇలా అన్యాక్రాంతమయ్యాయని తెలియడంతో స్వయంగా పరిశీలనకు వెళ్తున్నారు. తాజాగా ఆయన మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణల లెక్కలను తేలుస్తున్నారు. భోగాపురం మండలంలో గత ప్రభుత్వ హయాంలో డి-పట్టా భూములు జిరాయితీగా మారిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన భూ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను, భూములను పరిశీలించారు. . సుమారు 120 ఎకరాలు అప్పట్లో జిరాయితీగా మార్చారు. వీటన్నింటి లెక్క తేల్చబోతున్నారు.
సిసోడియా మొత్తం భూ వ్యవహారాలను బయటకు తీసి ప్రజల ముందు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు, అధికారులు తమకు అధికారం ఉందన్న కారణంతో ప్రజల్ని ఎలా దోచుకున్నారో .. . భూముల్ని, ఆస్తుల్ని ఎలా స్వాధీనం చేసుకున్నారో సిసోడియానే బ యట పెట్టే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెనుక ఉన్న అసలైన కుట్ర కూడా … సిసోడియా నివేదికలే వెల్లడించనున్నాయి.