సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న ఫ్యూచర్ సిటీగా తయారు చేస్తానని చెప్తోన్న ఫోర్త్ సిటీకి స్పెషల్ ఆఫీసర్ ను తీసుకరాబోతున్నట్లు తెలుస్తోంది.
ఫోర్త్ సిటీలో ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలకు అవకాశం ఉండేలా చర్యలు చేపట్టగా… రాబోయే కంపెనీలు, ఇప్పటికే హైదరాబాద్ లో ఉండి విస్తరణ చేపట్టబోయే కంపెనీలతో చర్చల కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోర్త్ సిటీ కోసం యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫోర్త్ సిటీ, పెట్టుబడులు, సీఎం ఇటీవలి అమెరికా-దక్షిణ కొరియా పర్యటన అంశాలపై చర్చించేందుకు త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు, జరిగిన ఎంఓయూలు, ఏయే కంపెనీలు రాబోతున్నాయన్న అంశాలను మంత్రివర్గానికి సీఎం వివరించబోతున్నారు.
ఇక, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హైడ్రాను మరింత బలోపేతం చేయబోతున్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో… హైడ్రా పోలీసు స్టేషన్లు, ఎస్సీలతో పాటు కింది స్థాయి వరకు వ్యవస్థ ఏర్పాటు అంశాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దాదాపు 3వేల మంది అధికారులను హైడ్రాకు ఇవ్వనున్నారు.