నయనతార స్టైల్ చాలా డిఫరెంట్. దక్షిణాదిన నెంబర్ వన్ కథానాయిక. అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్ కూడా తనే. కానీ తనని ఓ సినిమాకు ఒప్పించడం చాలా కష్టం. నయన చాలా కండీషన్లు పెడుతుంది. వాటిని తట్టుకొని సినిమా తీయాలంటే దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తాయి. నయన కూడా స్పీడు స్పీడుగా సినిమాలు తీసే రకం కాదు. యేడాదికి మహా అయితే రెండు సినిమాలు తీస్తుందంతే. అయితే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు నయన పూర్తిగా మారిపోయింది. తన చేతిలో ఇప్పుడు ఏకంగా 11 సినిమాలున్నాయి. దక్షిణాదినే కాదు, దేశం మొత్తమ్మీద ఇన్ని సినిమాల్ని ఒకేసారి చేస్తున్న కథానాయిక నయన మాత్రమే.
టెస్ట్, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, మహారాణి.. ఇవన్నీ నయనతార చేస్తున్న సినిమాలు. వీటితో పాటు మమ్ముట్టి హీరోగా ఓ సినిమా చేయడానికి ఒప్పుకొంది. ఇవి కాకుండా కన్నడలో రెండు, మలయాంలో రెండు, తమిళంలో మూడు సినిమాల్ని ఒప్పుకొందని తెలుస్తోంది. ఇది వరకు పక్కా కమర్షియల్ సినిమాల్లో నటించడానికి నయనతార అభ్యంతరాలు చెప్పేది. లేడీ ఓరియెండెట్ కథలకు పట్టం కట్టేది. అయితే ఇప్పుడు కమర్షియల్ కథలకూ ఓకే చెబుతోందని టాక్. షారుఖ్ ఖాన్ తో చేసిన ‘జవాన్’ కమర్షియల్ కథే. అది సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లోనూ నయన పేరు మార్మోగింది. అందుకే కమర్షియల్ సినిమాలకు మళ్లీ టచ్లో ఉండాలని భావిస్తోందట. ఈ కారణంతోనే నయన ఇప్పుడు 11 సినిమాలతో బజీ అయిపోయిందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు కనీసం రూ.10 కోట్ల పారితోషికం అందుకొంటే, ఈ సినిమాల ద్వారానే నయన దాదాపు రూ.110 కోట్లు సంపాదించినట్టు లెక్క.