రుణమాఫీ అర్హులైన వారికీ చేయలేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. అర్హత ఉన్నా.. రుణమాఫీ కోసం కాని రైతులకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆధార్‌లో తప్పులుంటే.. ఆధార్‌కు బదులుగా ఓటరు లేదా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
రేషన్ కార్డు లేకపోతే రైతుల కుటుంబాలకు సర్వే నిర్వహిస్తారు. బ్యాంక్ ఖాతాలో వ్యత్యాసాలను సరిచేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇప్పటికీ మూడు విడతల్లో రెండు లక్షల వరకూ రుణమాఫీ చేశారు. అయితే ఇంకా వేల మందికి రుణమాఫీల కాలేదన్న ఫీడ్ వస్తోంది.
నియోజకవర్గాల వారీగా ఇలాంటి వారు ఎక్కువ మంది ఉండటంతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ రెడీ అయిపోయాయి. మోసం చేశారన్న ఆరోపణలతో రుణమాఫీ కాని వారిని రోడ్ల మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు .. చిన్న చిన్న కారణాలతో రుణమాఫీ కాని వారికి మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.