ఎందుకో అల్లు అర్జున్ తన హేటర్స్‌కి చాలా ఈజీగా దొరికిపోతుంటాడు. తనే వాళ్లకు కావాల్సిన అస్త్రాల్ని చేచేతులా అందిస్తుంటాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ అవార్డు గ్రహీతలకు పేరు పేరునా అభినందనలు తెలిపాడు. రిషబ్ శెట్టి, నిత్యమీనన్, చందూ మొండేటిలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందించాడు. అంత వరకూ బాగానే ఉంది. అయితే డాన్స్ మాస్టర్ జానీని మాత్రం మర్చిపోయాడు. ఓ తమిళ చిత్రానికి గానూ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు తమిళ చిత్రానికే రావొచ్చు గాక. కానీ తను మన తెలుగువాడు. అందునా బన్నీ సినిమాలకు తాను పని చేశాడు. ముఖ్యంగా అల వైకుంఠపురంలో బాగా పాపులర్ అయిన ‘బుట్ట బొమ్మా..’ పాటని తనే కంపోజ్ చేశాడు. జానీ మాస్టర్ తో ఇంత పరిచయం, అనుబంధం ఉండి కూడా బన్నీ తన పేరు ప్రస్తావించలేదు. అందుకే మళ్లీ ట్రోల్ అవుతున్నాడు. జానీ జనసేన సపోర్టర్. అంతేకాదు.. జనసేన తరపున ఓ పాట కూడా రూపొందించాడు. ఆ పాట బాగా వైరల్ అయ్యింది. జనసేన పార్టీ తరపున తను ప్రచారం కూడా చేశాడు. ఓ దశలో జానీకి జనసేన సీటు ఇస్తుందని ఆశించారు. కానీ టీడీపీతో పొత్తు వల్ల అది కుదరలేదు. తనకు సీటు రాకపోయినా జనసేన జెండా మోశాడు జానీ. అల్లు అర్జున్‌కు జనసేన అంటే పడదని, అందుకే జనసేనకు సపోర్గ్ చేసిన జానీ మాస్టర్ ని కనీసం అభినందించలేకపోయాడని సోషల్ మీడియాలో తగులుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. కేవలం జనసేన సపోర్టర్ అని జానీ మాస్టర్‌కు విషెష్ చెప్పలేదా? లేదంటే ఫ్లోలో మర్చిపోయాడా అనేది బన్నీకే తెలియాలి.