లిక్కర్ స్కాం వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారన్న ప్రచారం ఆదివారం రోజంతా జరిగింది. రెండు నెలలుగా ఆయన పరారీలో ఉన్నారని సీఐడీ వ్యూహాత్మక లీకులిచ్చింది. కానీ అక్కడే అసలు ప్లాన్ ఉంది. వాసుదేరెడ్డిని అలా వదిలేసి.. లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికి ఆయన చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ… అన్ని డాట్స్ ను కలిపే ప్రయత్నం చేసింది. చివరికి వాటిని కలిపేసిందని…. మొత్తం స్కాం లబ్దిదారు జగన్ రెడ్డి దగ్గరకు చేరిపోయిందని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అప్రూవర్ గా మారిపోవడానికి వాసుదేవరెడ్డి అంగీకరించారని అంటున్నారు.
వాసుదేవరెడ్డిని అరెస్టు చేయకపోవడానికి అసలు కారణాలను అంచనా వేయలేక యలహంక ప్యాలెస్‌కు ఆయనను పదే పదే పిలిపించుకున్న జగన్ రెడ్డి… చాలా పెద్ద లాయర్లతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆ చర్చల్లో ఏం జరిగింది.. న్యాయనిపుణుల అభిప్రాయం ఏమిటి అన్నది కూడా వాసుదేవరెడ్డి సీఐడీ అధికారులకు చెప్పారని అంటున్నారు. ఇప్పటికీ ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని బిగ్ టార్గెట్ ను పెట్టుకున్నప్పుడు వాసుదేవరెడ్డి లాంటి వారిని ఎరగా వేసి ఫ్రీగా వదిలేయాలన్న వ్యూహాన్ని సీఐడీ పోలీసులు పెట్టుకున్నారు.
వాసుదేవరెడ్డి తప్పించుకుని పోలేని విధంగా ఇరుక్కున్నారు. ఎందుకంటే ఆయనను ముందు పెట్టి ఇతరులు దోచుకున్నారు. ఆయనకు చిల్లర పడేసి ఉంటారు. ఇప్పుడు తేడా రావడంతో వేల కోట్ల వ్యవహారాలన్నీ ఆయన మీదనే వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జీవితం ఇప్పుడు రిస్క్ లో పడిపోయింది. హాయిగా రైల్వే ట్రాఫిక్ సర్వీసులో పని చేసుకుంటూ ఉండేవాడు. ఏపీకి చెందిన వ్యక్తి కూడా కాదు. కానీ డిప్యూటేషన్ మీద తీసుకు వచ్చి ఆయనను పోస్టుల్లో పెట్టి మిగతా పని అంతా వైసీపీ నేతుల పూర్తి చేశారు. ఇప్పుడు తనను బలి చేయబోతున్నారని తెలిసి అందరి గుట్టు బయటపెట్టేందుకు రెడీ అయ్యారు.