మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి కావటంతో కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే, జగన్ అభ్యర్థనను తిరస్కరించాలని, విదేశీ పర్యటనకు అనుమతించవద్దంటూ సీబీఐ కోర్టును కోరింది.
లండన్ లో చదవుతున్న తన కుమార్తెను చూసేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. దీనిపై విచారణను నేటికి వాయిదా వేయగా, జగన్ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటు జగన్ తరఫు లాయర్లు, అటు సీబీఐ తరఫు లాయర్ల వాదనలు ముగియటంతో న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు.
కోర్టు ఈనెల 27న తీర్పు వెలువరించనుంది.
జగన్ వెళ్లే సమయంలోనే తాను కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ అక్రమాస్తుల కేసులో సహ నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇప్పటికే పిటిషన్ వేశారు.