వైసీపీకి షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారా? మరికొద్ది రోజుల్లో జగన్ కు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడెందుకు సిద్దం అవుతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీలో ముసలం పుట్టే ప్రమాదం ఉందన్న ప్రశ్నకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఇచ్చిన సమాధానం చర్చనీయాంశం అవుతోంది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని..అలా చెప్పడానికి తాను జ్యోతిష్యుడు కాదని చెప్పడం గమనార్హం. వైసీపీలో ముసలం వార్తలను నేరుగా కొట్టిపారేయకుండా బొత్స ఏం జరుగుతుందో చెప్పలేం అన్నారంటే..వైసీపీలో ఏదైనా జరగవచ్చునని ఆయన చెప్పకనే చెప్పేశారు.
వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని.. ఆ పార్టీలో కొనసాగితే భవిష్యత్ కష్టమేనని ఏడుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడెందుకు సిద్దమయ్యారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 11 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏడుగురు తిరుగుబాటు చేస్తే .. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ ఏడుగురిదే వైసీపీ అవుతోంది.
మరోవైపు ఎమ్మెల్యేల తిరుగుబాటు వార్తల నేపథ్యంలో జగన్ త్వరలోనే వారితో భేటీ కానున్నారని అంటున్నారు.