వైసీపీ అధినేత జగన్ ఏపీకి చుట్టంలా మారిపోయారు. అప్పుడప్పుడు వచ్చి పార్టీ నేతలను పలకరించి వెళ్తున్నారు తప్పితే, ఎక్కువగా రాష్ట్రంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఈ విషయంలో జగన్ ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. అందుకే ఆయన సైతం ఏపీలో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు.
వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల..ఆ పార్టీ అధికారం కోల్పోయాక ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. పార్టీ సమావేశాలకు కూడా ఏదో హాజరు అవుతున్నట్టుగా వచ్చి వెళ్తున్నారు తప్పితే గతంలోలా లీడ్ తీసుకోవడం లేదు. అయితే, పార్టీ ఓటమికి సజ్జల ప్రధాన కారణమని, ఆయన డైరక్షన్ లో సాగడం వల్లే ఈ రకమైన ఫలితాలు వచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో జగనే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు వైసీపీ నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. సజ్జలపై కూడా కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎం జరుగుతుందోనని ఆయన ఏపీకి దూరంగా ఉంటూ.. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారని అంటున్నారు. ముందస్తు వ్యూహంతోనే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారని చెబుతున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయాక జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉండేందుకు ఇష్టపడితే..సజ్జల హైదరాబాద్ లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క ఓటమితో ఇద్దరూ నేతలు రాష్ట్రానికి దూరం కావాల్సి వచ్చిందని, చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత అని ఊరికే అనలేదు అంటూ సెటైర్లు పేలుతున్నాయి.