పవన్ కల్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల, సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి, సినిమా షూటింగులతో బిజీ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఓజీ సినిమాకు అక్టోబరు నుంచి కొన్ని డేట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. బుధవారం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ పవన్ను కలిసింది. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ వంతు వచ్చింది.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. క్రిష్ తప్పుకొన్న తరవాత దర్శకత్వ బాధ్యతలు జ్యోతి కృష్ణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ లేని కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నారు. అందుకే ‘వీరమల్లు’ టీమ్ ఇప్పుడు పవన్ని కలిసింది. ఆయనతో భేటీ వేసింది. జ్యోతికృష్ణ, ఏ.ఎం.రత్నం, నిర్మాత ఎ.దయాకర రావు, ఛాయాగ్రహకుడు మనోజ్ పరమహంస పవన్ని కలిశారు. పవన్ డేట్ల గురించి డిస్కర్కన్ జరిగినట్టు తెలుస్తోంది. ‘ఓజీ’తో పాటుగా ‘వీరమల్లు’కు సైతం పవన్ కొన్ని డేట్లు కేటాయించినట్టు సమాచారం. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి. ‘వీరమల్లు’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.