జగన్ రెడ్డి దగ్గరకు తీసుకున్న అందరూ ఇప్పుడు ఆయన నిర్వాకాల గురించి గట్టిగానే నోరు విప్పుతున్నారు. విజయ్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యం వరకూ ఆయన గురించి కథలు కథలుగా చెప్పిన వాళ్లు ఎక్కువ. ఇప్పుడు కొత్తగా అజేయకల్లం కూడా తెరపైకి వస్తున్నారు. అజేయకల్లంగా ప్రసిద్ది చెందిన కల్లం అజేయరెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎస్‌గా పని చేశారు. పొడిగింపు ఇవ్వలేదని కోపంతో రిటైర్మెంట్ తర్వతా జగన్ రెడ్డి పంచన చేరారు. ఆయన చెప్పినట్లుగా చేయమన్న తప్పుడు ప్రచారాలన్నీ చేశారు.
చివరికి జగన్ వ్యూహంలో చిక్కుకుని ఆయన వివేకా హత్య కేసులో సాక్షిగా మారారు. వివేకా హత్య కేసు గురించి జగన్ కు ముందే తెలుసని సీబీఐకి పరోక్షంగా సమాచారం ఇచ్చింది అజేయకల్లమే. ఇప్పుడు ఆయన జగన్ కు దూరమయ్యారు. టీడీపీ సన్నిహితులకు ఇంటర్యూలు ఇస్తున్నారు. తాజాగా కందుల రమేష్ అనే జర్నలిస్టుకు ఇంటర్యూ ఇచ్చారు. ఈయన టీడీపీకి హార్డ్ కోర్ సపోర్టర్. ఆయనకు ఇంటర్యూ ఇచ్చారంటే… అజేయకల్లం కొన్ని కీలక విషయాలు బయట పెట్టాలని నిర్ణయించుకున్నట్లే అనుకోవచ్చు.
అజేయకల్లం జగన్ దగ్గరకు చేరిన తర్వాత మానసిక ప్రశాంత కోల్పోయారు. ఆయన సలహాదారుగా జీతాలు తీసుకున్నా ఆయనను అవసరమైనప్పుడు మాత్రమే పిలిచారు. జడ్జిలపై ఆరోపణలు చేయడానికి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఇతర తప్పుడు పనులకు వాడుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డికి పదవి పోవడంతో.. ఆయన టెన్షన్ పడుతున్నారు. అందుకే.. టీడీపీతో టచ్ లోకి వచ్చి కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు రెడీగా ఉన్నానన్న సంకేతాలు పంపుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.